Wednesday, October 3, 2018

ఇది దేశద్రోహుల దాహం వల్ల వచ్చిన ఎరుపు!


దాహం..
తీరని దాహం...
ఆరని మంటతో కలిసింది...
రక్తాన్ని మరిగింది.. రక్తపుటేర్లు పారించింది...
న్యాయం చిన్నబోయింది..

దాహం కొనసాగింది.. ప్రగతి ముసుగేసింది.. దేశానికి పాకింది.. 
ఏర్లు నదులయ్యాయి.. సంద్రాన్ని నింపాయి...
ఆవిరై నింగికెగిశాయి..

నీలాకాశం ఎరుపెక్కింది... దేశాన్ని కమ్మింది..

ఇప్పుడు న్యాయం వణుకుతోంది... 
వాక్యం తొణుకుతోంది.. కార్యం బెరుకుతోంది..

ఇది దేశద్రోహుల దాహం వల్ల వచ్చిన ఎరుపు!

No comments: