వాడిని మాత్రమే వాడానే అని ఫీలవకండి.
దానిని అనాల్సి వస్తుంది కాబట్టి ఈసారికి ఇలా సరిపెట్టుకోండి.
Cheap ని చీప్ చేసేసినట్లే, Settle ని కూడా మనం మరీ ఎక్కువగా సెటిల్ చేసేసాం.
ఎంతలా అంటే జీవితం గురించి తెలుసుకునేలోపే సెటిలయిపోయేంత; ఆనందమొచ్చినా కూడా ఒక్క స్టెప్పు కూడా వేయలేనంత;
పోనీ ఇప్పుడు నేర్చుకొవాలని మహా తీవ్రంగా ప్రయత్నిస్తే, నాగ చైతన్యాలానో, నానీలానో కుదరచ్చు. అది చాలదా అంటారా? చాలవచ్చు! అసలు అదేదో సినెమాలోలా మనసు లోపలే డాన్స్ కూడా చేస్కోవచ్చు!
అయినా, మేమేమన్నా డాన్సేస్తుంటే వద్దన్నామా ఆపామా అంటారా?
మీరు డాన్స్ ఆపక్కర్లేదు! డామినెన్స్ చూపిస్తే చాలు!
డాన్సే కాదు చాలా ఆగిపోతాయ్!
మానసిక ఎదుగుదలతో పాటు.
వాళ్ళు ఏదైనా అడిగేది తెలియకనే అని మర్చిపోకండి,
'అదంతే' అని గట్టిగా అన్నారంటే చాలు, ఇంకంతే!
మీరు ఆపేది, ఉత్సుకతనీ, తెలుసుకోవాలనే తపననీ.
వాటితో పాటుగా వాళ్ళ స్వేచ్ఛనీ.
వాటిని ఆపేస్తే అక్కడే ఆగిపోతుంది ఎదుగుదల!
మీకు తెలిసినవి కావచ్చు, తెలీనవి కావచ్చు.
తెలియనివైతే తెలుసుకొని చెప్పండి. సెటిల్ చేసేయకండి.
వాళ్ళని ఎదగనివ్వండి. వాళ్ళంతట వాళ్లనే స్వేచ్ఛగా సెటిల్ కానివ్వండి.
No comments:
Post a Comment